మద్యం మత్తులో గొడవ...ఒకరు మృతి
ABN , First Publish Date - 2020-03-13T13:37:42+05:30 IST
మద్యం మత్తులో గొడవ...ఒకరు మృతి

హైదరాబాద్: నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌పార్క్ హోటల్ వద్ద మోసిన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మోసిన్ అనే వ్యక్తిని అబ్బు కత్తితో గొంతుకోసి చంపేశాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అబ్బు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.