కారు.. ద్విచక్ర వాహనం ఢీ.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-10-27T09:54:34+05:30 IST

మహబూబాబాద్‌ శివారు కురవి రోడ్డు సాలార్‌తండా సమీపంలో సోమవారం రాత్రి కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి.

కారు.. ద్విచక్ర వాహనం ఢీ.. ముగ్గురి మృతి

మహబూబాబాద్‌ క్రైం, అక్టోబరు 26: మహబూబాబాద్‌ శివారు కురవి రోడ్డు సాలార్‌తండా సమీపంలో సోమవారం రాత్రి కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం.. మాధవాపురం నుంచి దూసరి రమేశ్‌ మహబూబాబాద్‌ వైపు కారులో వస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా దత్తాయిగూడెంకు చెందిన కర్నె స్వామి(30), అనంతారంకు చెందిన కర్నె రజిత(18), అమ్మనబోలు(మాటూరు) గ్రామానికి చెందిన బానాల రమేశ్‌(40) ఒకే ద్విచక్రవాహనంపై.. డోర్నకల్‌ మండలంలో కోళ్లఫాం నిర్వహిస్తున్న బానాల రమేశ్‌ మేనమామ వద్దకు వెళ్తున్నారు. సాలార్‌తండా సమీపంలో మలుపు వద్ద ద్విచక్రవాహనం, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురూ మృతి చెందారు.

Updated Date - 2020-10-27T09:54:34+05:30 IST