వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తల్లిని చంపేశాడు!

ABN , First Publish Date - 2020-12-28T12:01:27+05:30 IST

వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ ఆటో డ్రైవర్‌

వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తల్లిని చంపేశాడు!

హైదరాబాద్/జీడిమెట్ల : వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ ఆటో డ్రైవర్‌ కన్న తల్లిని గొంతు పిసికి హత్య చేశాడు. జగద్గిరిగుట్ట పోలీ‌స్ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ మహిళ(40) కూలి పని చేసుకుని జీవిస్తోంది. ఆమె కొంత కాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు ఆటో డ్రైవర్‌(24) ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో తల్లి మెడకు దుప్పటి చుట్టి గొంతు పిసికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా  స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-28T12:01:27+05:30 IST