యూకో బ్యాంకులో సాయుధ దొంగల దోపిడీ

ABN , First Publish Date - 2020-10-14T21:01:38+05:30 IST

ఆరుగురు సాయుధులు మోటారుసైకిళ్లపై వచ్చిబ్యాంకు అధికారులను బెదిరించి రూ.20 లక్షలు దోచుకున్న ఘటన...

యూకో బ్యాంకులో సాయుధ దొంగల దోపిడీ

బాలాసోర్ (ఒడిశా): ఆరుగురు సాయుధులు మోటారుసైకిళ్లపై వచ్చిబ్యాంకు అధికారులను బెదిరించి రూ.20 లక్షలు దోచుకున్న ఘటన ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ నగరంలో వెలుగుచూసింది. బాలాసోర్ నగరంలోని చౌకీ ఏరియాలోని యూకో బ్యాంకులో ఆరుగురు సాయుధులు మోటారు సైకిళ్లపై వచ్చి బ్యాంకు అధికారులను తుపాకులతో బెదిరించి రూ.20లక్షలు దోచుకెళ్లారు. బ్యాంకులో ఉన్న 20 మంది ఉద్యోగులను బెదిరించి 20 లక్షల రూపాయల విలువగల నగదు, బంగారం దోచుకెళ్లారని డీఎస్పీ అంకితా కుంభార్ చెప్పారు.బ్యాంకు మేనేజరు ఫిర్యాదు మేర పోలీసులు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.గతంలో ఒడిశాలో ఓ బ్యాంకులో దోపిడీ జరిగింది. 


కటక్ నగరంలో ఎస్పీఐ ఏటీఎంను దోచుకున్న నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదివారం భువనేశ్వర్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో గ్యాస్ కట్టర్ సాయంతో మిషన్ ను కట్ చేసి రూ.28 లక్షలు దోచుకున్నారు. ఇలా ఒడిశాలో తరచూ బ్యాంకు, బ్యాంకు ఏటీఎంలో దోపిడీలు సాగుతున్నాయి. 

Updated Date - 2020-10-14T21:01:38+05:30 IST