అతడినే పెళ్లి చేసుకుంటా.. దేవరాజ్ తల్లితో శ్రావణి

ABN , First Publish Date - 2020-09-14T00:59:46+05:30 IST

సీరియల్ నటి శ్రావణి ఆత్మకేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. దేవరాజ్ తల్లి సత్యవతితో శ్రావణి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అతడినే పెళ్లి చేసుకుంటా.. దేవరాజ్ తల్లితో శ్రావణి

హైదరాబాద్: సీరియల్ నటి శ్రావణి ఆత్మకేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. దేవరాజ్ తల్లి సత్యవతితో శ్రావణి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్ 2న సత్యవతికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్టలో దేవరాజ్‌పై కేసు నమోదు చేసిన తర్వాత సత్యవతికి శ్రావణి ఫోన్ చేసింది. ‘‘దేవరాజ్ అంటే నాకు ఇష్టం. మీరు ఒక్కసారి దేవరాజ్‌తో మాట్లాడండి. కేసు తర్వాత పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. కేసును రాజీ చేసుకుందామని చెప్పాడు. మీరు ఒప్పుకుంటే నేను దేవరాజ్‌ను పెళ్లి చేసుకుంటాను. మీరిద్దరూ సరే అంటే కట్న కానుకలు నేనే ఇస్తాను. మా ఇద్దరికి పెళ్లి చేయండి. మేము ఇద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాం’’ అని దేవరాజ్ తల్లి శ్రావణి మధ్య ఇలా సంభాషణ సాగింది. ఇప్పుడు వీరిద్దరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


గతంలో దేవరాజ్ రెడ్డి బర్త్‌ డే సందర్భంగా శ్రావణి మాట్లాడిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దేవరాజ్ తన ఫేవరెట్ హీరో అని శ్రావణి వీడియోలో చెప్పింది. ‘‘ఎంతోమంది పరిచయం అయినా.. నువ్వు మాత్రమే స్పెషల్. ఇప్పటి వరకు నీలో ఏ మిస్టేక్ కనిపించలేదు. చాలా జెన్యూన్‌గా, నా ఫ్యామిలీ మెంబర్‌లా.. నా గురించి ప్రతి నిముషం ఆలోచిస్తావు, నేను ఎక్కడున్నా నీకు శుభాకాంక్షలు చెబుతానంటూ’’ వీడియోలో శ్రావణి చెప్పింది. అయితే దేవరాజ్‌, సాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తారు. దేవరాజ్, సాయిలతో పాటు వీరిద్దరి కుటుంబసభ్యులను కూడా పోలీసులు విచారించారు. అయితే శ్రావణి కేసులో A1, A2 ఎవరనేది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2020-09-14T00:59:46+05:30 IST