పాకిస్థాన్‌లో మరో సిక్కు బాలిక కిడ్నాప్

ABN , First Publish Date - 2020-09-21T18:17:23+05:30 IST

పాకిస్థాన్ దేశంలోని పంజాసాహెబ్ వద్ద మరో 17 ఏళ్ల సిక్కు బాలికను గుర్తుతెలియని ఇద్దరు ముస్లిమ్ యువకులు కిడ్నాప్ చేశారు....

పాకిస్థాన్‌లో మరో సిక్కు బాలిక కిడ్నాప్

లాహోర్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలోని పంజాసాహెబ్ వద్ద మరో 17 ఏళ్ల సిక్కు బాలికను గుర్తుతెలియని ఇద్దరు ముస్లిమ్ యువకులు కిడ్నాప్ చేశారు. పంజాసాహిబ్ గురుద్వారాకు చెందిన ప్రీతంసింగ్ కుమార్తె అయిన బుల్ బుల్ కౌర్ (17) ను ఇద్దరు ముస్లిమ్ యువకులు కిడ్నాప్ చేశారు. గతంలో జగ్జిత్ కౌర్ లాగా ఈ సిక్కు బాలికను ఇస్లాం మతంలోకి మార్చి ముస్లిమ్ యువకుడితో వివాహం జరిపించే అవకాశం ఉందని సిక్కు బాలిక కుటుంబం ఆందోళన చెందుతోంది. 


యువతి బుల్ బుల్ కౌర్ తన తండ్రికి పంపిన వీడియోలో తాను తండ్రి వద్దకు తిరిగి వస్తే చంపుతారని భయం వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ పాక్ లోని సిక్కులు పాక్ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ కలిసి కోరారు. సిక్కు బాలిక కిడ్నాప్ ఉదంతంపై తాము పాక్ డిప్యూటీ కమిషనరుకు ఫిర్యాదు చేశామని ప్రీతమ్ సింగ్ చెప్పారు. కాగా తన కూతురు సెప్టెంబరు 15వతేదీన మదర్సాలో ఉందని బుల్ బుల్ కౌర్ తండ్రి చెపుతున్నారు. 


Updated Date - 2020-09-21T18:17:23+05:30 IST