మహిళా క్రీడాకారిణిపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి అఘాయిత్యం?
ABN , First Publish Date - 2020-12-15T12:37:10+05:30 IST
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు తనపై అత్యాచారం జరిపాడని అంతర్జాతీయ మహిళా క్రీడాకారిణి ఆరోపించిన ఘటన....

లక్నో (ఉత్తరప్రదేశ్) : సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు తనపై అత్యాచారం జరిపాడని అంతర్జాతీయ మహిళా క్రీడాకారిణి ఆరోపించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో వెలుగుచూసింది. సర్వత్ గ్రామ మాజీ అధిపతి అయిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఇంతెజార్ త్యాగి తనపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేశాడని ఓ మహిళా క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ నాయకుడి సోదరుడు రిజ్వాన్ త్యాగి పేరు కూడా క్రీడాకారిణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒక పని కోసం ఇంతెజార్ త్యాగి ఇంటికి వెళ్లినపుడు, ఆయన తనపై అత్యాచారం చేశాడని క్రీడాకారిణి ఆరోపించారు. త్యాగి తన అశ్లీల చిత్రాలను తీసి తనను బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా శారీరకంగా తనను వేధిస్తున్నాడని మహిళా క్రీడాకారిణి ఆరోపించారు. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు సివిల్ లైన్స్ పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 161 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు.