అత్యాచారం కేసులో ఆర్పీఎఫ్ ఏఎస్సై అరెస్టు
ABN , First Publish Date - 2020-12-13T08:26:02+05:30 IST
బాలికపై అత్యాచారం కేసులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఏఎస్సైని మల్కాజిగిరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కేరళకు చెందిన

మల్కాజిగిరి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): బాలికపై అత్యాచారం కేసులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఏఎస్సైని మల్కాజిగిరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కేరళకు చెందిన తంకచన్ లాలూ అలియాస్ లాలూ సెబాస్టియన్ (44) ఆర్పీఎఫ్ ముంబైలో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నారు. అదే అపార్టుమెంట్‌లో ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు (అక్కాచెల్లెళ్లు) ఉద్యోగులైన తల్లిదండ్రులు వచ్చేవరకూ ఏఎ్‌సఐ ఇంట్లో ఉండేవారు.
ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న బాలికతో ఏఎస్సై గత ఏడాది పాటు అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారం చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు విషయాన్ని ఈనెల 6న తన తల్లికి వివరించింది. దీంతో బాలిక తల్లి 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎ్‌సఐపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.