బైకులను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2020-03-13T20:04:16+05:30 IST
డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు డిచ్‌పల్లి

నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లికి చెందిన సుమన్ (32), రాజవ్వ (40), అనూష (10)గా గుర్తించారు. సుమన్ తన చెల్లి పెళ్లికి చెందిన పత్రికలు పంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.