లారీని ఢీకొన్న స్కార్పియో...ఒకరు సజీవదహనం
ABN , First Publish Date - 2020-03-13T13:55:52+05:30 IST
లారీని ఢీకొన్న స్కార్పియో...ఒకరు సజీవదహనం

సిద్దవటం: కడప జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లె దగ్గర శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీని స్కార్పియో ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్కార్పియో డ్రైవర్ బండి ఆది సజీవదహనం అయ్యాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కారు కర్నూలు జిల్లా బాలంపూరం నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.