ఘోర ప్రమాదం..నలుగురు చిన్నారుల మృతి
ABN , First Publish Date - 2020-12-15T13:34:24+05:30 IST
ఘోర ప్రమాదం..నలుగురు చిన్నారుల మృతి
కర్నూలు: జిల్లాలోని సిరివెళ్ల మండలం యర్రగుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు సురేఖ(10), ఝాన్సీ(11), వంశీ(10), హర్షవర్ధన్(10)గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్నపోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.