ప్రేమించాలంటూ విద్యార్థినికి ప్రొఫెసర్‌ వల్గర్‌ మెసేజ్‌లు

ABN , First Publish Date - 2020-05-17T15:20:00+05:30 IST

ఎంటెక్‌ విద్యార్థిని వేధిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ప్రేమించాలంటూ విద్యార్థినికి ప్రొఫెసర్‌ వల్గర్‌ మెసేజ్‌లు

హైదరాబాద్ ‌: ఎంటెక్‌ విద్యార్థిని వేధిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరీంనగర్‌ అచ్చంపల్లి ప్రాంతానికి చెం దిన కోలా హరీష్‌ ఉప్పల్‌ విజయపురి కాలనీలో ఉంటూ ఓ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో చదువుకుంటున్న ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగేవాడు. కొద్ది రోజులు ఫోన్లు, చాటింగ్‌లు చేసుకున్నారు. తర్వాత తనను ప్రేమించాలని వెంటపడ్డాడు.


దీంతో ఆమె హరీశ్‌ను దూరం పెట్టింది. పలుమార్లు ఫోన్‌ చేసినా, మెసేజ్‌ చేసినా స్పందించలేదు. తనను దూరం పెడుతుందని భావించి, కక్ష పెంచుకున్నాడు. అసభ్యకరంగా ఉన్న ఫొటోలను ఆమెకు, ఆమె కుటుంబసభ్యులకు వాట్సాప్‌లో పంపాడు. తనతో స్నేహంగా ఉండాలని లేకపోతే ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌క్రైం సిబ్బంది, సాంకేతిక ఆధారాల ద్వారా హరీ‌ష్‌ను అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2020-05-17T15:20:00+05:30 IST