మైనర్ బాలికపై సాధువు అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-02-08T14:25:28+05:30 IST

మాఘ మేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆశ్రమానికి వచ్చిన మైనర్ బాలికపై ఓ సాధువు అత్యాచారం చేసిన దారుణ ఘటన ....

మైనర్ బాలికపై సాధువు అఘాయిత్యం

ప్రయాగరాజ్ (ఉత్తరప్రదేశ్): మాఘ మేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆశ్రమానికి వచ్చిన మైనర్ బాలికపై ఓ సాధువు అత్యాచారం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ నగరంలో వెలుగుచూసింది. ప్రయాగరాజ్ నగరంలో సంజయ్ కుమార్ రాయ్ అనే సాధువు మాఘమేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు మేర జూసీ పోలీసులు సాధువుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రయాగరాజ్ ఎస్పీ అశుతోష్ మిశ్రా చెప్పారు. నిందితుడైన సంజయ్ కుమార్ రాయ్ గతంలో జర్నలిస్టుగా పనిచేసి సాధువుగా మారి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ వివరించారు.


Updated Date - 2020-02-08T14:25:28+05:30 IST