విశాఖ పోలీస్ స్టేషన్‌ సమీపంలో దారుణ హత్య

ABN , First Publish Date - 2020-03-21T15:13:59+05:30 IST

విశాఖ: బండరాయితో మోది ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

విశాఖ పోలీస్ స్టేషన్‌ సమీపంలో దారుణ హత్య

విశాఖ: బండరాయితో మోది ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఈ హత్య జరగడం గమనార్హం. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. క్లూస్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి.


Updated Date - 2020-03-21T15:13:59+05:30 IST