తాళం వేసి ఉన్న ఇళ్లు టార్గెట్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-29T18:54:16+05:30 IST

హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మాల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

తాళం వేసి ఉన్న ఇళ్లు టార్గెట్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మాల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి కథనం మేరకు.. మౌలాలిలోని భరత్ నగర్‌లో నివసించే శ్రవణ్ అలియాస్ చిన్న పెయింటర్‌గా పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసగా మారిన శ్రవణ్.. గత కొన్ని సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తున్నాడు.


ఇతనిపై గోల్కొండ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టెషన్‌లో కేసులున్నాయి. ఇటీవలే బెయిల్‌పై బయటకి వచ్చిన శ్రవణ్ 24వ తారీకున నెరేడ్‌మెట్‌లోని గీతానగర్‌లో తాళం వేసి ఇంటిలో దొంగతనం చేసి సుమారు 1.7 లక్షలు విలువ జేసే పూజా సామగ్రి, చీరలు దొంగలించాడు. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం అనుమానస్పదంగా తిరుగుతున్న శ్రవణ్‌ని పోలీసులు నేడు అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన నేరాలన్నింటినీ ఒప్పుకున్నాడు. 


Updated Date - 2020-05-29T18:54:16+05:30 IST