అఘాయిత్యం చేసి...అశ్లీల వీడియోలు విక్రయించి...

ABN , First Publish Date - 2020-10-31T15:31:04+05:30 IST

ఓ బస్సు కండక్టరు మహిళలతో సాగించిన లైంగిక చర్యలను వీడియోలు చిత్రీకరించి, వాటిని డబ్బు కోసం పోర్ను సైట్ లో విక్రయించిన బాగోతం...

అఘాయిత్యం చేసి...అశ్లీల వీడియోలు విక్రయించి...

బస్సు కండక్టరు బాగోతం గుట్టురట్టు

పాల్ఘార్ (మహారాష్ట్ర): ఓ బస్సు కండక్టరు మహిళలతో సాగించిన లైంగిక చర్యలను వీడియోలు చిత్రీకరించి, వాటిని డబ్బు కోసం పోర్ను సైట్ లో విక్రయించిన బాగోతం మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో వెలుగుచూసింది. విక్రమ్ ఘడ్ పట్టణానికి చెందిన మిలింద్ జాడే అనే బస్సు కండక్టరు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆకర్షించి వారిపై అత్యాచారం చేశాడు. మహిళలతో సాగించిన లైంగిక చర్యలను వీడియోలగా చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు. ఎంఏ బీఈడీ చదివిన జాడే 18,30 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి, దాన్ని చిత్రీకరించి వీడియోలను రూ.5లక్షలకు విక్రయించాడు. మహిళల ఫిర్యాదు మేర పోలీసులు నిందితుడిని అరెస్టు  చేశారు. జాడే తాను సాగించిన శృంగార వీడియోలను అశ్లీల వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Read more