కోడిగుడ్డు కూర వండలేదని స్నేహితుడిని చంపాడు...

ABN , First Publish Date - 2020-10-19T11:50:32+05:30 IST

విందుకు పిలిచి కోడిగుడ్డు కూర వండలేదని అతిధి తన స్నేహితుడినే చంపిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జరిగింది....

కోడిగుడ్డు కూర వండలేదని స్నేహితుడిని చంపాడు...

నాగపూర్ (మహారాష్ట్ర): విందుకు పిలిచి కోడిగుడ్డు కూర వండలేదని అతిధి తన స్నేహితుడినే చంపిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జరిగింది. నాగపూర్ నగరంలోని మంకాపూర్ ప్రాంతానికి చెందిన బనారసీ, గౌరవ్ గైక్వాడ్  లు స్నేహితులు. బనారసీ తన స్నేహితుడైన గౌరవ్ ను విందుకు ఆహ్వానించాడు. డిన్నరుకు వచ్చిన గౌరవ్ బనారసీతో కలిసి అర్దరాత్రి దాకా మద్యం తాగారు. భోజనంలో కోడిగుడ్డు కూర వండలేదనే ఆగ్రహంతో గౌరవ్ విందు ఇచ్చిన స్నేహితుడైన బనారసీని ఇనుపరాడ్డుతో తలపై కొట్టాడు. దీంతో బనారసీ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, కోడికూర వండలేదని విందుకు పిలిచిన స్నేహితుడిని చంపిన గౌరవ్ గైక్వాడ్ ను అరెస్టు చేశారు.

Updated Date - 2020-10-19T11:50:32+05:30 IST