గాళ్‌ఫ్రెండ్ తమ్ముడు, నాయనమ్మను చంపి.. రైలు కింద పడి ప్రేమికుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-11T23:22:47+05:30 IST

సోషల్ మీడియా ప్రేమ ఓ యువతి తమ్ముడు, ఆమె నాయనమ్మ హత్యకు కారణమైంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఈ దారుణ

గాళ్‌ఫ్రెండ్ తమ్ముడు, నాయనమ్మను చంపి.. రైలు కింద పడి ప్రేమికుడి ఆత్మహత్య

నాగ్‌పూర్: సోషల్ మీడియా ప్రేమ ఓ యువతి తమ్ముడు, ఆమె నాయనమ్మ హత్యకు కారణమైంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనమైంది.  22 ఏళ్ల యువకుడు తన ప్రేమికురాలి తమ్ముడు, ఆమె నాయనమ్మలను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మొమిన్‌పురాకు చెందిన మోయిన్‌ఖాన్ గురువారం మధ్యాహ్నం నగరంలోని హజరీపహాడ్‌లో ఉన్న తన గాళ్‌ఫ్రెండ్ గుంజన్ ఇంటికి వెళ్లి ఆమె నాయనమ్మ 70 ఏళ్ల ప్రమీలా మరోటి ధుర్వేను పొడిచి చంపాడు. అనంతరం గుంజన్ తమ్ముడు యశ్ (10)ను కూడా హతమార్చాడు. తీవ్ర గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 


అదే రోజు రాత్రి మన్కాపూర్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌‌పై మొయిన్ ఖాన్ మృతదేహం లభ్యమైంది. రైలు కింద పడి అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గతేడాది నవంబరులో గుంజన్‌కు మోయిన్‌ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. అతడిని తన స్నేహితుడిగా గుంజన్ తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. అయితే, వారిద్దరి మధ్య సంబంధం ఉందని అనుమానించిన గుంజన్ కుటుంబ సభ్యులు అతడికి బ్రేకప్ చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆమె దగ్గరి నుంచి ఫోన్ తీసుకున్నారు. అనంతరం ఆమెను బంధువుల ఇంటికి పంపించారు. దీనిని తట్టుకోలేకే అతడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-11T23:22:47+05:30 IST