కరోనా వల్ల ఆర్థిక సమస్యలతో కూతుర్ని చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి

ABN , First Publish Date - 2020-06-26T14:56:27+05:30 IST

కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలతో ఓ తల్లి తన కుమార్తెను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన....

కరోనా వల్ల ఆర్థిక సమస్యలతో కూతుర్ని చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి

పాల్ఘార్ (మహారాష్ట్ర): కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలతో ఓ తల్లి తన కుమార్తెను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘార్ పట్టణంలోని జవహర్ ప్రాంతంలో వెలుగుచూసింది. జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన మంగళ అనే మహిళ తన భర్త దిలీప్ జాను, కుమార్తె రోషిణీలతో కలిసి నివాసముండేవారు. దిలీప్ రోజువారీ కూలీ. కరోనా వైరస్ వల్ల గత మూడు నెలలుగా పని లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్థిక సమస్యలతో ఆవేదన చెందిన మంగళ తన కుమార్తె రోషిణీకి చీరతో ఉరి వేసి చంపి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు తల్లీ కూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-26T14:56:27+05:30 IST