ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన మైనర్.. చివరికి..
ABN , First Publish Date - 2020-12-27T12:20:00+05:30 IST
ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం చేసిన

హైదరాబాద్/మంగళ్‌హాట్ : ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం చేసిన ఓ బాలుడిని నాలుగు గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళ్‌హాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆసీ్‌ఫనగర్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ బాలుడు(17) శనివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగాపురాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బుల తీసేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. డబ్బులు తీసేందుకు వీలు కాకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది.
శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. మంగళ్‌హాట్ మార్కెట్‌లో నిందితుడు తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకొని జ్యూవెనల్ హోంకు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.