వైద్యవిద్యార్థిని అదృశ్యం...ఆపై మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-08-20T16:28:32+05:30 IST

అదృశ్యమైన పీజీ వైద్యవిద్యార్థిని మృతదేహమై కనిపించిన ఘటన....

వైద్యవిద్యార్థిని అదృశ్యం...ఆపై మృతదేహం లభ్యం

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): అదృశ్యమైన పీజీ వైద్యవిద్యార్థిని మృతదేహమై కనిపించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగర సమీపంలో వెలుగుచూసింది. ఆగ్రా నగరంలో 25 ఏళ్ల వైద్యవిద్యార్థిని పీజీ చదివేది. మంగళవారం సాయంత్రం వైద్యవిద్యార్థిని అదృశ్యమైంది. తమ కూతురిని జలౌన్ పట్టణానికి చెందిన ఓ డాక్టర్ కిడ్నాప్ చేసి హతమార్చాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యవిద్యార్థిని మృతదేహం తల, మెడకు గాయాలున్నాయి. వైద్యవిద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి, డాక్టరును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. యోగి సర్కారులో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, మహిళలకు భద్రత కొరవడిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఆరోపించారు. 

Updated Date - 2020-08-20T16:28:32+05:30 IST