శంషాబాద్ వద్ద నడుముకు గన్ పెట్టుకుని వ్యక్తి హల్ చల్

ABN , First Publish Date - 2020-11-21T14:38:15+05:30 IST

శంషాబాద్ వద్ద ఓ యువకుడు నడుముకు గన్ పెట్టుకుని స్థానికులను భయాందోళనకు గురిచేశాడు.

శంషాబాద్ వద్ద నడుముకు గన్ పెట్టుకుని వ్యక్తి హల్ చల్

హైదరాబాద్: శంషాబాద్ వద్ద ఓ యువకుడు నడుముకు గన్ పెట్టుకుని స్థానికులను భయాందోళనకు గురిచేశాడు. తాను  సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వింగ్‌లో పని చేస్తానంటూ స్థానికులకు చెప్పుకొచ్చాడు. అతను మద్యం సేవించి అనుమానంగా నడుముకు గన్ ఉండడంతో ‌ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతని వద్ద ఉన్న గన్ నిజమైంది కాదని, ఎయిర్ గన్‌గా గుర్తించారు. అతని పేరు సోహెల్ అని, బేగంపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సోహెల్  శంషాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ ఎయిర్ పోర్ట్ కార్గో‌లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more