మద్యం దొరకలేదని గొంతు కోసుకున్నాడు

ABN , First Publish Date - 2020-03-30T14:16:16+05:30 IST

కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలులో ఉండటంతో మద్యం

మద్యం దొరకలేదని గొంతు కోసుకున్నాడు

బెంగళూరు : కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలులో ఉండటంతో మద్యం లభించలేదని మందుబాబులు తంటాలు పడుతున్నారు. తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా ఐడిహళ్ళి చిక్కదాళవాటకు చెందిన హనుమంతప్ప అనే వ్యక్తి ఏకంగా మద్యం లభించదలేదని రెండురోజులుగా తిట్టుకుంటూ గడిపారు. ఆదివారం ఏకంగా గొంతు కోసుకున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు మధుగిరి ఆసుపత్రికి తరలించారు. కొడిగేనహళ్ళి పోలీసులు గ్రామాన్ని సందర్శించి వివరాలు సే


కరించారు. ఇక దక్షిణకన్నడ జిల్లాలో ఇరువురు. బీదర్‌ జి ల్లాలో ఓ వ్యక్తి చెరువులో దూకి  ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యల వెనుకా మధ్యంకు బానిసలుగా మారడమే కారణమని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత మద్యం, బీడీ, సిగరెట్‌లు, గుట్కాలు లభించక బానిసలుగా మారిన వారు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహస్తున్నారు. 

Updated Date - 2020-03-30T14:16:16+05:30 IST