లాక్‌డౌన్‌లో అతితెలివి.. మెడికల్‌ షాపులో మద్యం అమ్మకం!

ABN , First Publish Date - 2020-04-15T20:58:39+05:30 IST

లాక్‌డౌన్ వేళ బార్లు, లిక్కర్ షాపులు అన్నీ బంద్ అయిపోయాయి.

లాక్‌డౌన్‌లో అతితెలివి.. మెడికల్‌ షాపులో మద్యం అమ్మకం!

ముంబై: లాక్‌డౌన్ వేళ బార్లు, లిక్కర్ షాపులు అన్నీ బంద్ అయిపోయాయి. దీంతో మందు బాబులు నానాతిప్పలూ పడుతున్నారు. వీరి దురవస్థను క్యాష్ చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. దీనికి తాజాగా మహారాష్ట్రలో వెలుగుచూసిన ఉదంతమే నిదర్శనం. నాగ్‌పూర్‌లోని గణేష్‌పేట్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని లాక్‌డౌన్ నిబంధనలను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన మెడికల్ షాపులోనే అక్రమంగా బీర్ అమ్మకం మొదలెట్టేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు షాపుపై రెయిడ్ చేశారు. మంచినీళ్ల బాటిళ్లలో బీర్ పోసి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో షాపు యజమాని నిషాంత్ అలియాస్ బంటీ ప్రమోద్ గుప్తా(36)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-04-15T20:58:39+05:30 IST