క్వారంటైన్‌లోని మహిళలపై లైంగిక దాడి..!

ABN , First Publish Date - 2020-06-21T16:43:40+05:30 IST

ర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ క్వారంటైన్‌ కేంద్రంలోని మహిళలపై లైంగిక దాడి చేసిన యువకుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

క్వారంటైన్‌లోని మహిళలపై లైంగిక దాడి..!

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ క్వారంటైన్‌ కేంద్రంలోని మహిళలపై లైంగిక దాడి చేసిన యువకుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు శంకర్..కేంద్రంలోని బాత్‌రూమ్ వద్ద ఉన్న ఓ మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. అయితే అతడి నెట్టేసిన బాధితురాలు అక్కడి నుంచి పారిపోయింది. ఆమెను వెంబడించే క్రమంలో ఉన్న శంకర్..ఓ రూంలో నిద్ర పోతున్న మరో యువతిని చూశాడు. ఆ గదిలోకి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడి చేయబోయాడు. అయితే అదే గదిలో ఉన్న ఇతర మహిళలు రక్షించాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేయండంతో అక్కడున్న వారు శంకర్ ప్రయాత్నాలను అడ్డుకుని అతడిని బంధించి పోలీసులకు అప్పగించారు. కాగా..గదిలో ఉన్న బాధితురాలి స్వస్థలం ముంబై అని, ఇటీవల బెంగళూరు వచ్చి ప్రభుత్వం నిర్ధేశించిన క్వారంటైన్‌లో ఉంటోందని పోలీసు అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-06-21T16:43:40+05:30 IST