స్కూటర్‌పై వస్తూ దుస్తులు విప్పి.. మహిళతో అసభ్య ప్రవర్తన..

ABN , First Publish Date - 2020-12-28T12:28:39+05:30 IST

తను కారులో కూర్చొని ఉండగా ఓ స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతని మర్మాంగాన్ని తనకు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

స్కూటర్‌పై వస్తూ దుస్తులు విప్పి.. మహిళతో అసభ్య ప్రవర్తన..

న్యూఢిల్లీ: తను కారులో కూర్చొని ఉండగా ఓ స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతని మర్మాంగాన్ని తనకు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఢిల్లీ-నోయిడా ఫ్లైవేలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్లైవేలో కారులో ఓ యువతి వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి స్కూటర్‌పై వెళ్తున్నాడు. కారు నడుపుతున్న యువతి వాహనాన్ని పక్కన ఆపిన సమయంలో.. స్కూటరుపై ఉన్న సదరు వ్యక్తి ఆ కారు వద్దకు వచ్చాడు. గబగబా తన స్కూటర్ దిగేశాడు. ఆ వెంటనే ఆమెకు తన మర్మాంగం కనిపించేలా ప్రవర్తించాడు. దీనిపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను మూత్ర విసర్జన చేయడం కోసం ఇలా చేశానని, అంతేగానీ మరే ఉద్దేశ్యమూ లేదని సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకున్నాడు.

Updated Date - 2020-12-28T12:28:39+05:30 IST