ఆస్పత్రిలో దూరి.. కరోనా సోకిన భార్యను ఎత్తుకెళ్లిన భర్త!

ABN , First Publish Date - 2020-07-19T02:50:46+05:30 IST

కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న భార్యను, తాజాగా ఆమె జన్మనిచ్చిన పసికందును ఇంటికి తీసుకెళ్లిపోయాడో వ్యక్తి.

ఆస్పత్రిలో దూరి.. కరోనా సోకిన భార్యను ఎత్తుకెళ్లిన భర్త!

మంగళూరు: కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న భార్యను, తాజాగా ఆమె జన్మనిచ్చిన పసికందును ఇంటికి తీసుకెళ్లిపోయాడో వ్యక్తి. ఆస్పత్రి నుంచి అతను వెళ్లబోతుండగా అడ్డగించిన ఆస్పత్రి సిబ్బందికి కూడా టోకరా ఇచ్చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. ఇక్కడ స్థానికంగా నివశించే ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి హాస్పిటల్‌‌కు వచ్చిన భర్తను సిబ్బంది అడ్డగించినా ప్రయోజనం లేకపోయింది. భార్య, పసిబిడ్డను తీసుకొని అతను ఇంటికెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే ఈ కుటుంబాన్ని ట్రేస్ చేశారు.

Updated Date - 2020-07-19T02:50:46+05:30 IST