బాలిక మతమార్పిడికి యత్నించిన యువకుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-17T12:51:07+05:30 IST

ఓ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెను బలవంతంగా మత మార్పిడి చేసేందుకు యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన....

బాలిక మతమార్పిడికి యత్నించిన యువకుడి అరెస్ట్

బిజ్నూర్ (ఉత్తరప్రదేశ్): ఓ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెను బలవంతంగా మత మార్పిడి చేసేందుకు యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ పట్టణంలో వెలుగుచూసింది. బిజ్నూర్ పట్టణానికి చెందిన సాకిబ్ ధాంపూర్ ప్రాంతానికి చెందిన బాలికను వివాహం చేసుకుంటానని చెప్పి కిడ్నాప్ చేసి ఆమెను మతమార్పిడి చేసేందుకు యత్నించాడని బిజ్నూర్ రూరల్ ఎస్పీ సంజయ్ కుమార్ చెప్పారు. ధాంపూర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక గత కొన్ని రోజులుగా అదృశ్యమైంది. సాకిబ్ తన పేరు సోను అని చెప్పి బాలికను కిడ్నాప్ చేసి మతమార్పిడికి బలవంతం చేశాడు. దీంతో సాకిబ్ పై మతమార్పిడి యత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. బాలిక మైనర్ అని, నిందితుడు ముస్లిమ్ అని అమ్మాయికి తర్వాత తెలిసిందని పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-12-17T12:51:07+05:30 IST