ఇళ్లలో దిగంబరంగా దొంగతనాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-12T23:44:07+05:30 IST
విశాఖ పట్టణంలో ఇళ్లలో దిగంబరంగా దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు...

విశాఖ: విశాఖ పట్టణంలో ఇళ్లలో దిగంబరంగా దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన కంచర్ల మోహన్‌రావుతో పాటు అతనికి సహకరిస్తున్న అనకాపల్లికి చెందిన సంతోష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుడిపై 60కి పైగా కేసులు నమోదయ్యాయని, 6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. దిగంబరంగా చోరీలు చేస్తే మతి స్థిమితం లేని వ్యక్తిగా భావించి వదిలేస్తారని నిందితుడి ఆలోచన కావచ్చని డీసీపీ పేర్కొన్నారు.