కేవైసీ అప్‌డేట్ల పేరుతో మోసం

ABN , First Publish Date - 2020-04-26T13:52:39+05:30 IST

కేవైసీ అప్‌డేట్‌ చేయాలని ఫోన్‌ చేసి, ఇద్దరి వ్యక్తుల

కేవైసీ అప్‌డేట్ల పేరుతో మోసం

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: కేవైసీ అప్‌డేట్‌ చేయాలని ఫోన్‌ చేసి, ఇద్దరి వ్యక్తుల ఖాతాలోంచి రూ.68 వేలను దోచుకున్నారని సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. ఎస్సార్‌నగర్‌ వీకేగూడకు చెందిన సందీప్‌కుమార్‌ ఫోన్‌నంబర్‌కు దుండగులు ఫోన్‌ చేసి బ్యాంకు వివరాలతోపాటు ఓటీపీ నెంబర్‌ తెలుసుకుని అతడి అకౌంట్‌ నుంచి రూ.68 వేలను దోచుకున్నారు. సుభా‌ష్‌చంద్రబోస్‌ అనే మరో వ్యక్తి ఖాతా నుంచి రూ.50 వేలను సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. దీంతో బాధితులు ఇద్దరూ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరో సంఘటనలో...

పురానాపుల్‌ ప్రాంతానికి చెందిన విభూతిభూషన్‌పాత్ర అనే వ్యక్తి ఖాతా  నుంచి రూ.లక్షా నాలుగు వేలు దోచుకున్నారని బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2020-04-26T13:52:39+05:30 IST