నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇచ్చి..

ABN , First Publish Date - 2020-12-28T12:24:15+05:30 IST

కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ మహిళపై

నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇచ్చి..

హైదరాబాద్/కూకట్‌పల్లి : కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ మహిళపై అత్యాచారయత్నం చేయడంతోపాటు ఆమెను హతమార్చేందుకు యత్నించాడో వ్యక్తి. ఓ మహిళ(50) స్థానికంగా కూలి పనిచేసుకొని జీవిస్తోంది. ఆమెకు భర్త లేడు. మూసాపేటకు చెందిన రాము(40) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడు మేస్త్రిగా పనిచేస్తుండడంతో అతడితోపాటే మహిళ కూడా పనికి వెళ్లేది. ఈనెల 25వ తేదీ రాత్రి పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా బైక్‌పై దింపుతానని రాము ఆమెను నమ్మించాడు.


అతడు ఆమెను బైక్‌పై తీసుకెళ్తూ మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. మహిళ ప్రతిఘటించటంతో బండరాయితో తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. స్పృహలోకి వచ్చిన ఆమె ఇంటికి వెళ్లగా కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-12-28T12:24:15+05:30 IST