పట్టపగలే భార్యను హతమార్చిన భర్త.. జీవత ఖైదు విధించిన దుబాయ్ కోర్టు

ABN , First Publish Date - 2020-07-28T00:21:25+05:30 IST

భార్యపై అనుమానంతో కేరళకు చెందిన ఓ వ్యక్తి పట్టపగలే ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఈ కేసులో దుబాయ్ కోర్టు అతడికి జీవిత ఖైదు..

పట్టపగలే భార్యను హతమార్చిన భర్త.. జీవత ఖైదు విధించిన దుబాయ్ కోర్టు

తిరువనంతపురం: భార్యపై అనుమానంతో కేరళకు చెందిన ఓ వ్యక్తి పట్టపగలే ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఈ కేసులో దుబాయ్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. కేరళకు చెందిన సీఎస్ ఉగేష్(44), విద్యా చద్రన్(40) భార్యాభర్తలు. అయితే విద్య దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఉగేష్ కేరళలోనే నివశిస్తున్నాడు. అయితే విద్య ప్రవర్తనపై ఉగేష్‌కు అనుమానం వచ్చింది. ఆమె మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని అనుమానించాడు. దీంతో విజిటింగ్ వీసాపై దుబాయ్ చేరుకున్నాడు. భార్య పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆఫీసులో గొడవ చేయోద్దంటూ విద్య వారిస్తున్నప్పటికీ ఉగేష్ ఆగలేదు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఉగేష్ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో విద్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.


ఈ కేసులు పోలీసులు ఉగేష్‌ను అదుపులోనికి తీసుకుని కోర్టులో హాజరు పర్చారు. కేసును విచారించిన జడ్జి ఉగేష్‌కు జీవిత ఖైదు(25 సంవత్సరాల జైలు) విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై విద్య కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విద్య చనిపోవడం, ఉగేష్ జైలు పాలవడంతో వారి ఇద్దరు పిల్లలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

Updated Date - 2020-07-28T00:21:25+05:30 IST