మహిళను చంపిన కేసులో భారతీయ సంతతి వ్యక్తి అరెస్టు..

ABN , First Publish Date - 2020-05-17T21:51:43+05:30 IST

మహిళను అత్యంత కిరాతకంగా చంపి ముక్కలు చేసి 2 సూట్‌కేసుల్లో పెట్టి పారేసిన కేసులో భారతీయ సంతతికి...

మహిళను చంపిన కేసులో భారతీయ సంతతి వ్యక్తి అరెస్టు..

లండన్: మహిళను అత్యంత కిరాతకంగా చంపి ముక్కలు చేసి 2 సూట్‌కేసుల్లో పెట్టి పారేసిన కేసులో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిని ఇంగ్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన గరీకా కోనీట గోర్డాన్‌(27)కు హత్యా సమయంలో మహేశ్ సోరాతియా(38) సాయం చేసినట్లు తమ విచారణలో తేలిందని గ్లౌసెస్టర్‌షైర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు మహేశ్‌ను చెల్టన్‌హామ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచినట్లు పోలీసులు వివరించారు. 


స్థానిక డీన్ అడవిలో మే 12వ తేదీన ఓ మహిళ మృతదేహం తమకు లభ్యమైందని, రెండు ముక్కలుగా రెండు సూట్‌కుసుల్లో ఉన్న ఆ కళేబరాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. కాగా ఆమె హత్య కేసులో గోర్డాన్‌ను ప్రధాన నిందితురాలిగా తేలిందని, అయితే ఆమెకు హత్యా సమయంలో మహేశ్‌ సాయం చేసినట్లు సాక్ష్యాలు లభించడంతో అతడిని కూడా అదుపులోనికి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2020-05-17T21:51:43+05:30 IST