ఆటోలో పేలుడు...ఒకరికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2020-10-24T19:18:05+05:30 IST

ఆటోలో పేలుడు...ఒకరికి తీవ్రగాయాలు

ఆటోలో పేలుడు...ఒకరికి తీవ్రగాయాలు

హైదరాబాద్: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఆటోలో పేలుడు కలకలం రేగింది. అస్బెస్టాస్ కాలనీ వద్ద ఆటోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఎక్కుతున్న ప్రయాణికుడి కాలికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు.  పేలుడుకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-10-24T19:18:05+05:30 IST