ప్రియుడి సహకారంతో భర్తను హతమార్చిన భార్య
ABN , First Publish Date - 2020-06-26T15:34:15+05:30 IST
రాజమండ్రి: సఖినేటిపల్లి మండలం వుయ్యూరు వారి మెరకలో దారుణం చోటు చేసుకుంది.
రాజమండ్రి: సఖినేటిపల్లి మండలం వుయ్యూరు వారి మెరకలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు చొప్పల్ల శివ సహకారంతో భర్త ఉప్పు ప్రసాద్‌ను భార్య ప్రశాంతి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల రెండో తారీఖున అర్ధరాత్రి ప్రసాద్ చనిపోవడంతో.. సహజ మరణంగానే భావించి.. గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు.
పదిహేను రోజుల తర్వాత ఫోన్ సంభాషణల ఆధారంగా హత్యోదంతం బయటపడింది. హత్య చేసిన విధానం బయట పడటంతో.. ఆడియో రికార్డింగ్‌ల ఆధారంగా గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడు చొప్పల్ళ శివ, ప్రశాంతిని అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు మృతుడు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.