కరోనా పేషెంట్‌కు 12లక్షల బిల్లు.. ఆస్పత్రి లైసెన్స్ రద్దు!

ABN , First Publish Date - 2020-08-02T05:23:58+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఇలాంటి సమయంలో చాలా సంస్థలు డబ్బు కోసం కాకుండా ప్రాణాలు కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నాయి.

కరోనా పేషెంట్‌కు 12లక్షల బిల్లు.. ఆస్పత్రి లైసెన్స్ రద్దు!

చెన్నై: దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఇలాంటి సమయంలో చాలా సంస్థలు డబ్బు కోసం కాకుండా ప్రాణాలు కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా పేషెంట్‌లను పీడించుకు తినాలని చూసిన ఓ ఆస్పత్రికి అధికారులు బుద్ధిచెప్పారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. ఇక్కడి ‘బీ వెల్ హాస్పిటల్’లో ఓ కరోనా పేషెంట్ చికిత్స చేయించుకున్నాడు. కరోనా చికిత్స ఫీజును కట్టడి చేయడం కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలను సదరు ఆస్పత్రి ఉల్లంఘించింది.


ఆ పేషెంట్‌కు రూ.12.20లక్షల ఫీజు వేసింది. అలాగే పేషెంట్లకు మెడిసిన్స్ కూడా ఆస్పత్రి నుంచి లభించలేదట. ఈ విషయాలు తెలుసుకున్న ప్రభుత్వం ఆస్పత్రిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సదరు ఆస్పత్రి ఆథరైజేషన్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్యమంత్రి సీ విజయభాస్కర్ వెల్లడించారు.

Updated Date - 2020-08-02T05:23:58+05:30 IST