హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
ABN , First Publish Date - 2020-12-20T00:21:34+05:30 IST
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్: నగరంలో భారీగా డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. రూ.కోట్లు విలువ చేసే డ్రగ్స్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల్లో ముఠా డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ మెటీరియల్స్ చాటున డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చిన డ్రగ్స్ పట్టుకున్నారు. కిలోకి పైగా మెథమెటమిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరాపై డీఆర్‌ఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫుడ్ ఐటమ్స్‌లో కలిపి తీసుకునే డ్రగ్స్‌గా గుర్తించారు.