ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు.. పిల్లలకు ఉరేసి భర్తల ఆత్మహత్య.. భార్యలు షాక్.!

ABN , First Publish Date - 2020-06-19T21:56:40+05:30 IST

ఈ రోజు పిల్లలను సరదాగా బయటు తీసుకెళ్తాం.. అని తమ భార్యలతో చెప్పారా అన్నదమ్ములు.

ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు.. పిల్లలకు ఉరేసి భర్తల ఆత్మహత్య.. భార్యలు షాక్.!

అహ్మదాబాద్(గుజరాత్): ఈ రోజు పిల్లలను సరదాగా బయటు తీసుకెళ్తాం.. అని తమ భార్యలతో చెప్పారా అన్నదమ్ములు. నలుగురు పిల్లలను తీసుకుని కారులో సిటీకి దూరంగా వచ్చారు. రోజంతా హ్యాపీగా తిప్పారు.. సిటీకి దూరంగా తమకు చెందిన ఫ్లాట్ కు ఆ పిల్లలను తీసుకెళ్లారు. అన్నంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. పిల్లలు నిద్రపోయాక వారిని ఉరి తీశారు. ఆ తర్వాత తాము కూడా ఉరేసుకుని చనిపోయారు.. మరుసటి రోజు రాత్రయినా పిల్లలు, భర్తలు తిరిగి రాకపోవడంతో ఆ భార్యలు కంగారుపడ్డారు. ఇద్దరూ కలిసి ఆ ఫ్లాట్ కు వెళ్లారు.. లోపల తలుపులు వేసి ఉండటం.. ఎంత పిలిచినా పలకకపోవడంతో కంగారుపడ్డారు. ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తీరా పోలీసులు వచ్చి.. తలుపులను పగులగొట్టిచూస్తే షాక్.. ఆరుగురి మృతదేహాలను చూసి.. జరిగిన ఘోరాన్ని గ్రహించి ఆ భార్యలిద్దరూ కుప్పకూలిపోయారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 


అమ్రిష్ పటేల్(42), గౌరంగ్ పటేల్(40) ఇద్దరూ సోదరులు. అహ్మదాబాద్ లోనే తమ భార్యా పిల్లలతో వేరు వేరు చోట్ల హ్యాపీగా జీవిస్తున్నారు. జూన్ 17 బుధవారం నాడు ’పిల్లలను బయటకు తీసుకెళ్తాం..‘ అని ఇద్దరూ తమ తమ భార్యలతో చెప్పారు. వారు కూడా సరేనన్నారు. దీంతో నలుగురు పిల్లలను కారులో బయటకు తీసుకెళ్లారు. గురువారం రాత్రయినా తిరిగి రాకపోవడంతో భార్యలు కంగారు పడ్డారు. సిటీకి దూరంగా తాము కొనుగోలు చేసిన ఫ్లాట్ కు వెళ్లారు. లోపల గడియ పెట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీరా పోలీసులు వచ్చి తలుపులు పగుల గొట్టి చూసి.. అంతా కంగుతిన్నారు.  


’ఇద్దరు అన్నదమ్ములు తమ పిల్లలకు అన్నంలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చారు. తిన్న వెంటనే వారు మత్తుగా నిద్రపోయారు. తొమ్మిదేళ్ల కీర్తి, ఏడేళ్ల శాన్విని వంట గదిలో ఉరి వేశారు. 12 ఏళ్ల వయసున్న మయూర్, ధ్రువ్ లను బెడ్రూంలో ఉరి వేశారు. అన్నదమ్ముళ్లిద్దరూ డ్రాయింగ్ రూమ్‌లో ఉరి వేసుకున్నారు..‘ అని ఇన్ స్పెక్టర్ డీఆర్ గోహిల్ వివరించారు. మృతదేహాలను ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపించామని.. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని ఆయన వివరించారు. అన్నదమ్ముళ్లిద్దరూ ఈ దారుణానికి పాల్పడటానికి కారణం ఏమై ఉంటుందా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2020-06-19T21:56:40+05:30 IST