4 గంటల్లో మూడు ఏటీయంలు ఖాళీ.. షాక్‌లో పోలీసులు
ABN , First Publish Date - 2020-12-27T08:32:29+05:30 IST
ఏటీయంలు దొంగతనం చేయడంలో బాగా చేయి తిరిగిన ఓ ముఠాను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు చాలా కష్ట పడుతున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరగడం గమనార్హం. ఇక్కడ ఓ ముఠా వరుసగా మూడు ఏటీయంలను దోచేసింది

న్యూఢిల్లీ: ఏటీయంలు దొంగతనం చేయడంలో బాగా చేయి తిరిగిన ఓ ముఠాను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు చాలా కష్ట పడుతున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరగడం గమనార్హం. ఇక్కడ ఓ ముఠా వరుసగా మూడు ఏటీయంలను దోచేసింది. ఇదంతా కేవలం నాలుగు గంటల సమయంలో ఈ ముఠా.. మొత్తం మూడు ఏటీయంలను ఖాళీ చేసేసింది. పశ్చిమ ఢిల్లీలోని కీర్తినగర్, నారాయణ విహార్, మదిపూర్ ప్రాంతాల్లోని ఏటీయంలను ఈ ముఠా దోచేకుందని పోలీసులకు తెలియజేశారు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసు శాఖ.. ఈ ముఠాను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.