వివాహమైతే విడిపోవాల్సి వస్తుందని స్నేహితురాళ్ల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-18T18:13:00+05:30 IST

వివాహం జరిగితే విడిచి ఉండాలా? అనే ఆవేదనతో ఓ యువతి స్నేహితురాలితో కలిసి ఉరేసు కొని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.

వివాహమైతే విడిపోవాల్సి వస్తుందని స్నేహితురాళ్ల ఆత్మహత్య

చెన్నై: వివాహం జరిగితే విడిచి ఉండాలా? అనే ఆవేదనతో ఓ యువతి స్నేహితురాలితో కలిసి ఉరేసు కొని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. నామక్కల్‌ జిల్లా ఎలచ్చిపాళయం సమీపం కొక్కలై ఏలయంపాళయం ప్రాంతానికి చెందిన నందకుమార్‌, జ్యోతి (23) దంపతులకు  రెండేళ్ల కుమార్తె ఉంది. జ్యోతి తల్లిదండ్రులు కేరళ రాష్ట్రంలో కూలీ పనులు చేస్తుంటారు. కాగా భర్తతో విభేధించిన జ్యోతి పెరియమనిలోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. జ్యోతి సమీపంలో కర్మాగారంలో పనులకు వెళుతుండగా, అక్కడే పనిచేసే కోటపాళయంకు చెందిన ప్రియ (20)తో పరిచయం ఏర్పడింది. వారిద్దరు ప్రాణస్నేహితులుగా మారారు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లేవారు. 


ఇదిలా ఉండగా.. ఈ నెల 27న ప్రియకు వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. వివాహం చేసుకుంటే ప్రాణ స్నేహితురాలిని వదలి వెళ్లాల్సి వస్తుందని ప్రియ మనోవేదనకు గురైనట్టు సమాచారం. శనివారం ఉదయం ప్రియ బయటకు వెళ్తున్నానని తల్లితో చెప్పి జ్యోతి ఇంటికి వెళ్లింది. ఇద్దరు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానించిన స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఒకే చీరతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడం చూసి దిగ్ర్భాంతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-05-18T18:13:00+05:30 IST