పశువులను దొంగిలించిన కేసులో భజరంగ్‌దళ్ మాజీ సభ్యుడి అరెస్ట్
ABN , First Publish Date - 2020-12-19T16:54:25+05:30 IST
పశువులను దొంగిలించి, కబేళాలకు విక్రయించిన కేసులో భజరంగదళ్ మాజీ సభ్యుడిని అరెస్టు చేసిన ఘటన....

బెంగళూరు (కర్ణాటక): పశువులను దొంగిలించి, కబేళాలకు విక్రయించిన కేసులో భజరంగదళ్ మాజీ సభ్యుడిని అరెస్టు చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో వెలుగుచూసింది. భజరంగ్ దళ్ మాజీ సభ్యుడు అనిల్ ప్రభును పశువుల అక్రమ రవాణ చేసి, కబేళాలకు విక్రయించిన కేసులో ఉడుపి పోలీసులు అరెస్టు చేశారు.అనిత్ తోపాటు అతని అనుచరుడు యాసీన్ గడ్డి మైదానాల్లో మేస్తున్న పశువులను పట్టుకొని కబేళాలకు విక్రయించారు. యాసీన్ ఉడుపిలోని హడ్కో కాలనీవాసి. అనిల్ ప్రభు ఉడుపి జిల్లా కర్కల తాలూకాలోని భజరంగ్ దళ్ మాజీ ఆఫీసు బేరర్. అనిల్ గతంలో పనిచేసినా ప్రస్థుతం తమ భజరంగ్ దళ్ తో ఆయనకు సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించింది.అనిల్ ను జుడీషియల్ కస్టడీకి పంపించామని ఉడుపి పోలీసులు చెప్పారు.