గుంటూరులో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-11-21T18:28:48+05:30 IST

గుంటూరు నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు: నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్పొరేషన్ సమీపంలోని చేపల మార్కెట్ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సెల్ ఫోన్ షాపు అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.


సెల్ ఫోన్ షాపులోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక ఇంకేమైన కారణంవల్ల జరిగిందా? అన్నది తెలియలేదు. సెల్ ఫోన్ షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పక్కనున్న షాపులకు మంటలు వ్యాపించాయి. అయితే గతంలో ఈ కాంప్లెక్స్‌లో చేపల మార్కెట్ ఉండేది. కరోనా లక్ డౌన్ కారణంగా చేపల మార్కెట్‌ను అక్కడి నుంచి ఖాళీ చేసి నగర శివారుకు తరలించారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more