హయత్‌నగర్ ఎంపీడీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-03-18T15:13:10+05:30 IST

హైదరాబాద్: హయత్‌నగర్ ఎంపీడీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

హయత్‌నగర్ ఎంపీడీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: హయత్‌నగర్ ఎంపీడీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

Updated Date - 2020-03-18T15:13:10+05:30 IST