ఫ్యాను దొంగలకు గ్రామస్థులు ఏ శిక్ష విధించారంటే.

ABN , First Publish Date - 2020-06-12T04:26:22+05:30 IST

ఫ్యాను దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను గ్రామస్థులు చితక్కొట్టేశారు.

ఫ్యాను దొంగలకు గ్రామస్థులు ఏ శిక్ష విధించారంటే.

బరౌలీఖలీదాబాద్: ఫ్యాను దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను గ్రామస్థులు చితక్కొట్టేశారు. వారి మెడలో చెప్పుల జతను వేలాడదీసి వీధుల్లో ఊరేగించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరౌలీఖలీదాబాద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దొంగతనం చేస్తుండగా వారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆ తరువాత గ్రామస్థులందరూ వారి చేతులు కట్టేసి దేహ శుద్ధి చేశారు. అక్కడితో ఆగక వారి  మెడలో చెప్పుల దండను వేలాడదీసి గ్రామమంతా ఊరేగించారు. అయితే ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్థుల నుంచి దొంగలను విడిపించారు. కేసు నమోదు చేసుకుని దొంగలను కస్టడీలోకి తీసుకున్నారు.

Updated Date - 2020-06-12T04:26:22+05:30 IST