కంపెనీలో 67 లక్షలు కాజేసి.. ఉద్యోగంలోంచి తీసేశాడని బాస్ హత్య!
ABN , First Publish Date - 2020-07-18T22:34:06+05:30 IST
ప్రస్తుత స్టార్టప్‌ల యుగంలో యువత వీటి వెంట పరుగులు పెడుతోంది.

మాన్హాటన్: ప్రస్తుత స్టార్టప్‌ల యుగంలో యువత వీటి వెంట పరుగులు పెడుతోంది. సొంత కంపెనీలకు సీఈవోలు అవ్వడానికి తహతహలాడుతోంది. ఇలానే ఎన్నో ఆశలతో ఓ స్టార్టప్ స్థాపించాడు ఫహీమ్ సాలే అనే బంగ్లాదేశీ. పథావో అనే ఈ స్టార్టప్‌లో పనిచేసే టైరీస్ దేవన్ హాస్పిల్ అనే ఓ ఎంప్లాయీ కంపెనీ సొమ్ము కాజేసినట్లు ఫహీమ్ గుర్తించాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 90వేల డాలర్లు(రూ. 67లక్షలపైగా) దోచుకున్నట్లు తేలడంతో ఫహీమ్ ఆగ్రహానికి అంతులేకుండా పోయింది. దీంతో టైరీస్ను ఉద్యోగంలో నుంచి పీకేశాడు. దీన్ని మనసులో పెట్టుకున్న టైరీస్.. కంపెనీ సహవ్యవస్థాపకుడైన ఫహీమ్ను హతమార్చాడు. అమెరికాలోని మాన్హాటన్లో ఫహీమ్ అపార్ట్మెంటులోనే అతని మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. కంపెనీ మాజీ ఉద్యోగి టైరీసే ఈ హత్య చేసినట్లు తేల్చారు.