వెబ్‌సైట్లో ఫొటోలు పెట్టి.. 54వేలు కాజేశారు!

ABN , First Publish Date - 2020-07-06T04:22:52+05:30 IST

వ్యాపారం చేసుకుంటూ చక్కగా జీవితం సాగుతున్న వేళ ముంబైకి చెందిన ఓ బిజినెస్‌మేన్ కుటుంబానికి భారీ షాక్ తగిలింది.

వెబ్‌సైట్లో ఫొటోలు పెట్టి.. 54వేలు కాజేశారు!

ముంబై: వ్యాపారం చేసుకుంటూ చక్కగా జీవితం సాగుతున్న వేళ ముంబైకి చెందిన ఓ బిజినెస్‌మేన్ కుటుంబానికి భారీ షాక్ తగిలింది. సమాజంలో కొంత పేరు సంపాదించిన ఆ కుటుంబ సభ్యుల వివరాలు ఓ ఎస్కార్ట్ వెబ్‌సైట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యాపారి వెంటనే వెబ్‌సైట్ నిర్వాహకులకు ఫోన్ చేశాడు. ఇదేంటని ప్రశ్నించాడు. అతనికి సరిగా సమాధానం చెప్పని ఆ నిర్వాహకులు.. తమకు డబ్బులిస్తే ఆ కుటుంబం వివరాలు తొలగిస్తామని చెప్పారు. సరేనని కొంత డబ్బు చెల్లించిన తర్వాత కూడా వెబ్‌సైట్లో వివరాలు తొలగించలేదు. అదేంటని అడగ్గా మరోసారి డబ్బు అడిగారు. ఇలా మూడు విడతలుగా రూ.54వేలు కాజేశారు. అయినా తమ కుటుంబ వివరాలు ఆ ఎస్కార్ట్ వెబ్‌సైట్లో తొలగించకుండా మళ్లీ సొమ్ము అడగడంతో సదరు బిజినెస్‌మేన్‌కు ఏం చేయాలో అర్థంకాలేదు. పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-06T04:22:52+05:30 IST