మాటేసి కాటేసిన మృత్యువు!

ABN , First Publish Date - 2020-12-20T08:57:20+05:30 IST

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఊహించలేం!. అలాంటిదే ఈ సంఘటన. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోలసానపల్లిలోని గొల్లపల్లి- పోలసానపల్లి మార్గంలో మలుపు వద్ద హర్యానాకు చెందిన మోటార్‌

మాటేసి కాటేసిన మృత్యువు!

ఆగి ఉన్న లారీని తాకి విద్యుదాఘాతంతో ఇద్దరు సజీవ దహనం

అప్పటికే లారీ పై భాగాన్ని తాకిన విద్యుత్‌ వైర్లు


నూజివీడు రూరల్: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఊహించలేం!. అలాంటిదే ఈ సంఘటన. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోలసానపల్లిలోని గొల్లపల్లి- పోలసానపల్లి మార్గంలో మలుపు వద్ద హర్యానాకు చెందిన మోటార్‌ బైక్‌లను తరలించే భారీ కంటైనర్‌ లారీ 11 కేవీ విద్యుత్‌ వైర్లు కంటైనర్‌ క్యాబిన్‌ తాకాయి. దీంతో డ్రైవర్‌, క్లీనర్‌.. క్యాబిన్‌లో నుంచి ఎడమవైపు డోర్‌ను తన్నుకుని తప్పించుకున్నారు.


ఈ విషయం తెలియని మీర్జాపురానికి చెందిన పెనుమాక జోజిబాబు(42), షేక్‌ మస్తాన్‌(65)  అటుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ.. లారీని రోడ్డు మధ్యలో ఎందుకు ఆపారని డ్రైవర్‌ను అడిగేందుకు డోర్‌ను తట్టడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. రెప్పపాటులో లారీతోపాటు.. వారి బైక్‌కు కూడా అనూహ్యంగా మంటలు అంటుకుని.. సజీవ దహనమయ్యారు. అటుగా వెళ్తున్న పలువురు  వారిని రక్షించాలని భావించినా ఆ అవకాశం కూడా లేకపోయింది. సమాచారం అందుకున్న.. పోలీసులు మృతదేహాలను నూజివీడు ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-20T08:57:20+05:30 IST