తమ్ముడి మృతదేహం వద్ద విలపిస్తూ.. అన్న మృతి

ABN , First Publish Date - 2020-03-13T15:58:13+05:30 IST

వరంగల్ అర్బన్: మృత్యువులోనూ ఆ అన్నదమ్ముల బంధం వీడలేదు. తన తమ్ముడి మృతదేహం వద్ద విలపిస్తూ ఓ అన్న గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.

తమ్ముడి మృతదేహం వద్ద విలపిస్తూ.. అన్న మృతి

వరంగల్ అర్బన్: మృత్యువులోనూ ఆ అన్నదమ్ముల బంధం వీడలేదు. తన తమ్ముడి మృతదేహం వద్ద విలపిస్తూ ఓ అన్న గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. కమలాపుర్ మండలం భీంపల్లిలో బచ్చల సదానందం(45) అనే వ్యక్తి అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. విషయం తెలసుకున్న సదానందం అన్న బచ్చల రాజు గోదావరిఖని నుంచి కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలకు వచ్చాడు. తమ్ముడి మృత దేహం వద్ద విలపిస్తూ రాజు ఒక్కసారిగా గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.


Updated Date - 2020-03-13T15:58:13+05:30 IST