పక్క గదిలో పిల్లలు.. తల్లి గొంతు కోసి చంపిన దుండగుడు!

ABN , First Publish Date - 2020-11-21T22:52:23+05:30 IST

సెట్ టాప్ బాక్స్ రీచార్జ్ చేస్తానంటూ ఇంటికొచ్చిన ఓ వ్యక్తి.. ఆ ఇంట్లోని మహిళను దారుణంగా చంపేశాడు. ఆ సమయంలో పక్క గదిలోనే ఉన్న ఆమె పిల్లలపై కూడా దాడి చేశాడు.

పక్క గదిలో పిల్లలు.. తల్లి గొంతు కోసి చంపిన దుండగుడు!

ఆగ్రా: సెట్ టాప్ బాక్స్ రీచార్జ్ చేస్తానంటూ ఇంటికొచ్చిన ఓ వ్యక్తి.. ఆ ఇంట్లోని మహిళను దారుణంగా చంపేశాడు. ఆ సమయంలో పక్క గదిలోనే ఉన్న ఆమె పిల్లలపై కూడా దాడి చేశాడు. అదృష్ట వశాత్తూ పిల్లలిద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ నిషా సింఘాల్, అజయ్ సింఘాల్ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. డెంటిస్ట్ అయిన నిషా.. ఆరోజు పిల్లలతో ఇంట్లోనే ఉంది. టీవీ టెక్నీషియన్ ఇంటికి రావడంతో తలుపులు తీసింది. అలా వచ్చిన వ్యక్తి కత్తితో నిషాపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి చంపేశాడు.


ఆ తర్వాత పక్క గదిలోని ఆమె పిల్లలపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో అజయ్ ఆస్పత్రిలో ఉన్నాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుడిని శుభమ్ పాఠక్‌గా గుర్తించారు. ఇల్లుదోచుకోవాలనే ఆలోచనతోనే శుభమ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read more