ప్రేమికుడిని చంపిన జంటకు జీవిత ఖైదు

ABN , First Publish Date - 2020-11-27T13:41:17+05:30 IST

మహిళ ప్రేమికుడిని చంపిన దంపతులకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిన ఘటన...

ప్రేమికుడిని చంపిన జంటకు జీవిత ఖైదు

జిల్లా కోర్టు సంచలన తీర్పు

మధుర (ఉత్తరప్రదేశ్): మహిళ ప్రేమికుడిని చంపిన దంపతులకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో వెలుగుచూసింది. మధుర జిల్లా కోలనా గ్రామంలో 2018 ఫిబ్రవరి 24వతేదీన హరేంద్ర సింగ్ అనే ప్రేమికుడిని టెక్ చంద్ (39), ఆయన భార్య రజని (32)లు హత్య చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది శివరామ్ చెప్పారు. రెండేళ్ల క్రితం మహిళ ప్రేమికుడిని చంపినందుకు జిల్లా కోర్టు జడ్జి  సాధనరాణి దోషులైన టెక్ చంద్, రజనీలకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు. హరేంద్ర సింగ్ తలపై ఈ దంపతులు చెరుకు గడతో కొట్టి చంపారని ప్రాసిక్యూషన్ తెలిపింది. దోషులైన జంటకు జీవిత ఖైదుతోపాటు 25వేల జరిమానాను జిల్లా జడ్జి రాణిఠాకూర్ విధించారు. ఈ జరిమానా మొత్తాన్ని బాధిత కుటుంబసభ్యులకు అందజేయాలని జిల్లా జడ్జి ఆదేశించారు. 

Read more